పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ జనం ముందుకు రావడానికి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుండటంతో ఈ సినిమా మీద హైప్ పెరిగింది. దీని డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక సినిమాని దిల్ రాజు-శిరీష్, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీరామ్ వేణు దీనికి దర్శకత్వం వహించారు. ఉగాది కానుకగా ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదలవుతుంది.
ఇటీవలే దీని డబ్బింగ్ మొదలు పెట్టి పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పడం ఈరోజుతో పూర్తయింది. ఫైనల్ మిక్సింగ్ లాంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు నటించారు. దీనికి ఎస్.ఎస్. తమన్ అందించారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా తన టీమ్ తో పవన్ ఫొటో దిగారు.
Must Read ;- కుర్రకారు కేరింతలతో వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్