తెలంగాణ దుబ్బాకలో జరిగే ఉప ఎన్నికలు ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్య నేతల దృష్టంతా కూడా దుబ్బాక పైనే పెట్టారు. దీంతో ఇప్పుడు దుబ్బాక ఎన్నికలు అందరికీ ఒక ఆసక్తికర అంశంగా మారింది.
నా పార్టీ కాదు.. నేను వెళ్తే పరువు పోతుంది..
ఇప్పటికే తెలంగాణకు చెందిన ముఖ్యనేతలతా దుబ్బాకపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యూహాలు రచిస్తున్నారు. ఆరెస్సెస్ వర్గాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రచారానికి ఊపు రావాలంటే… ఓ సూపర్ స్టార్ వస్తే బాగుటుందని అంచనా వేస్తున్నారు. ఆ సూపర్ స్టార్ పవన్ కల్యాణ్ అయితే బాగుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దిశగా పవన్ కల్యాణ్‌ను ఒప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. దుబ్బాక ప్రచారానికి పవన్ ను తీసుకు వెళ్లాలని భాజపా ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ… ప్రచారానికి వెళ్లడం అంటూ జరిగితే పరువు పోతుందని పవన్ కల్యాణ్ డిసైడైనట్లు విశ్వసనీయ సమాచారం.
ఇటీవల కాలంలో జనసేన పార్టీ కన్నా.. భాజపా గురించే ఎక్కువ ట్విట్లు చేస్తున్న పవన్ కల్యాణ్ ను తమ ఎన్నికల ప్రచారానికి భాజపా వినియోగించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. అక్కడ భాజపా అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆయన అక్కడ పోటీ చేశారు. ఇప్పటికే అక్కడ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దాంతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు భాజపా భావిస్తోంది. కానీ..
ఎవరు ప్రచారం చేసిన గెలిచేది ఆ పార్టీనే..
దుబ్బాకలో ఎవరు ప్రచారం చేసినా.. తెరాస గెలిచి తీరుతుంది. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెరాస పెద్దలు కొందరు దుబ్బాక మీద పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో తాను ప్రచారానికి వెళ్తే పరువు పోతుందని పవన్ ఆలోచిస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
కోట్లకు కోట్లు రెమ్యునరేషన్లు ఇచ్చిన సినిమా షూటింగులకే పవన్ ఇంట్లోంచి బయటకు రావడం లేదు. అలాంటిది ఇప్పుడు భాజపా తరఫున ప్రచారం చేయడానికి ఆయన వస్తారంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే.ఎలాగూ.. ప్రచారం చేసినా భాజపా గెలవదు, పైగా అభ్యర్థి తన పార్టీ తరఫు వాడు కాదు అలాంటప్పుడు ప్రచారానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. వెళ్లి అనవసరంగా తన పరువు తానే తీసుకున్నట్లు అవుతుందని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తుంది.











