చిత్తూరు జిల్లాలోని తిరుపతి కరకంబాడి, నూనెగుండ్లపల్లి వద్ద బ్యాటరీ తయారీ యూనిట్లలో కాలుష్యం ఎక్కువగా వస్తోందని కాలుష్య నియంత్రణ బోర్డు ఈ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్య నియంత్రణ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై అమరరాజా బ్యాటరీస్ యాజమాన్యం స్పందించింది. నాలుగు దశాబ్దాలుగా బాధ్యతాయుత సంస్థగా, పర్యావరణ పరిరక్షణకు పెద్ద ఎత్తున ఖర్చు చేశామని సంస్థ యాజమాన్యం తెలిపింది. కాలుష్య నియంత్రణ కోసం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమరరాజా బ్యాటరీస్ తెలిపింది.
కడపలో జువారీ సిమెంట్ మూసివేత
కడప జిల్లాలో గత 22 సంవత్సరాలుగా సిమెంటు ఉత్పత్తి చేస్తున్న జువారీ సిమెంటు కంపెనీని మూసివేశారు. కాలుష్యం ఎక్కువగా వస్తోందంటూ నిర్దరించిన కాలుష్య నియంత్రణ మండలి, జువారీ కంపెనీకి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో జువారీ సిమెంటు కంపెనీ మూత పడింది. 3 వేల మంది కార్మికులు రోడ్డునపడ్డారు. సీఎం సతీమణి భారతి నడుపుతున్న భారతీ సిమెంటుకు మార్కెట్లో పోటీ వస్తోందనే జువారీ కంపెనీని మూసివేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.
Must Read ;- చంద్రబాబు పేరు చెప్పు, నిన్ను వదిలేస్తాం : సీఐడి అధికారులు ఒత్తిడి











