విచారణ అనంతరం శుక్రవారం, శనివారం కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సీఐడి అధికారులు చెప్పినట్టు దేవినేని మీడియాకు వెల్లడించారు. తిరుపతి ఉప ఎన్నికలకు ముందు తనతో వీడియో ప్లే చేయించింది చంద్రబాబేనని చెప్పమని సీఐడి అధికారులు ఒత్తిడి తెచ్చారని దేవినేని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే తనను వదిలేస్తామని సీఐడి అధికారులు అన్నారని దేవినేని మీడియాకు వెల్లడించారు. నారా లోకేష్ ను కూడా విచారణకు పిలుస్తామని చెప్పారని దేవినేని తెలిపారు.
మా గొంగు నొక్కాలని చూస్తున్నారు
సీఎం జగన్ కు కనీసం క్యాబినెట్ సమావేశం పెట్టే దమ్ములేదని దేవినేని ఉమ ధ్వజమెత్తారు. ప్రతిపక్షనాయకులపై తప్పుడు కేసులు పెట్టి మా గొంతు నొక్కాలని చూస్తున్నారని, అక్రమ కేసులకు భయపడేది లేదని ఆయన అన్నారు. తన ఇంటి చుట్టూ అర్థరాత్రి 200 పోలీసులను మోహరించారని, అరెస్టు చేయాలని చూశారని హైకోర్టు ఆదేశాల వల్లే తాను అరెస్టు నుంచి బయటపడ్డానని చెప్పారు. ఇవాళ కూడా దేవినేని సీఐడి అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది.
Must Read ;- మంగళగిరి సీఐడీ కార్యాలయంలో హాజరైన మాజీ మంత్రి దేవినేని