Actress Neha Deshpande’s Peep Show Poster Viral In Social Media :
పీప్ షో.. ఇదేదో కొత్త పదంలానే ఉంది. ఓ యువకుడి ఫొటో ముందేసుకుని ఎక్స్ పోజింగ్ తో ఓ భామ పోజిస్తూ ఓ పోస్టర్ రిలీజైంది. ఇంతకీ పీప్ షో అంటే ఏంటో తెలుసా? దొంగచాటుగా తొంగి చూడటం అట. కుర్రకారుకు ఇది అలవాటైన పదమే కాబట్టి కొందరికి కొత్తగా ఉండొచ్చు. సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో ఈ ‘పీప్ షో’ చిత్రం రూపొందుతోంది. దీనికి ఎస్.ఆర్. కుమార్ నిర్మాత. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా రూపొందుతున్న చిత్రమిది.
నేహాదేశ్ పాండే హీరోయిన్. ఆమె ఎక్స్ పోజింగ్ తోనే ఫస్ట్ లుక్ విడుదలైంది. ఆటోరాంప్రసాద్ అంటే జబర్దస్త్ బృందం మద్దతు లేకుండా ఎలా ఉంటుంది. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ముఖ్య అతిథులుగా వచ్చి ఈ పోస్టర్ ను విడుదల చేశారు. స్వతహాగా ఆటోరాంప్రసాద్ లో రైటర్ ఉన్నాడు. ఇదే విషయాన్ని హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను నొక్కి చెప్పారు. ‘పీప్ షో” కాన్సెప్ట్ తమకు తెలుసని, ఈ కాన్సెప్ట్ తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని, అందరికీ విపరీతంగా నచ్చుతుందని’ వీరు అన్నారు.
బుల్లి తెరపై కామెడీ సునామి సృష్టిస్తున్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను “పీప్ షో” ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం పట్ల హీరో ఆటో రాంప్రసాద్, దర్శకుడు క్రాంతి కుమార్, నిర్మాత సురేష్ కాకుమాని, హీరోయిన్ నేహాదేశ్ పాండే సంతోషం వ్యక్తం చేశారు. ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సుప్రీమ్ డ్రీమ్స్ బ్యానర్ కు ఇది శుభారంభాన్ని ఇస్తుందని ఎగ్జికూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ కాకుమాని, నిర్మాత ఎస్.ఆర్. కుమార్ అన్నారు. దీని కెమెరామెన్ ఈశ్వర్, ఎడిటర్ సునీల్ మహారాణా కూడా ఫస్ట్ లుక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి పీర్వోగా ధీరజ్- అప్పాజీ చేస్తున్నారు. మంచి మసాలా అంశాలతో ఈ చిత్రం తెరకెక్కుతోందని ఈ ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమవుతోంది.
Must Read ;- ఇంత లేటు వయసులో అంత హాట్ అవసరమా?