ఉదయ్ కిరణ్ హీరోయిన్ అనిత మళ్లీ హాట్ ఫొటోలతో పోజిచ్చేస్తోంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. నువ్వు నేను సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్లు అవుతుంది. అంటే అనిత వయసు దాదాపు 40 ఏళ్లకు చేరువైనట్లే. అయినా ఆమె తన అందాల ఆరబోతతో తానింకా యవ్వనంతోనే ఉన్నట్లు గుర్తుచేస్తోంది. తన బేబి బంప్ తోనూ ఫొటోలకు పోజిచ్చి ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవల స్విమ్ సూట్ లో ఫొటోకు పోజిచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె పూర్తి పేరు అనిత హసానందాని.
ఆమెది ప్రేమ వివాహం. రోహిత్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతను పారిశ్రామిక వేత్త. పెళ్లి చేసుకునేటప్పటికే ఆమె దాదాపు సినిమాలకు దూరమైంది. అవకాశాలు కూడా అంతగా రాలేదు. నువ్వు నేను తర్వాత తొట్టిగ్యాంగ్ లాంటి కొన్ని సినిమాల్లో నటించింది. సినిమా అవకాశాలు తగ్గడంతో సీరియల్స్ వైపు మళ్లింది. బుల్లితెరపై నాగిని సీరియల్ లో అలరించింది. హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2013లో ఆమె రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. నాచ్ బలియే 9 సీజన్ లో ఈ జంట పాల్గొన్నారు.
కాకపోతే పిల్లలు కలగడం ఆలస్యమైంది. ఆమె తల్లి కాబోతున్నప్పుడు కూడా చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ఆ వీడియోను కూడా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆమె సోషల్ మీడియాలో సందడి చేశారు. కొంత కాలంగా నటనకు దూరమైనా మళ్లీ ఆమె తెరమీదకు రాబోతుందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. మొత్తానికి హాట్ ఫొటోలతో అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నాన్ని ఆమె చేస్తోంది.
Must Read ;- అందాల నిధిని అందుకోవడం కష్టమే!