ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం కరోనా కారణంగా బ్రేక్స్ పడ్డాయి. దాని కారణంగానే ఆగస్ట్ 13న విడుదల తేదీని లాక్ చేసుకొన్న ఈ సినిమా ఇప్పుడు కేన్సిల్ చేసుకుంది. అయితే ‘పుష్ప’ సినిమాను రెండు పార్ట్స్ గా తీస్తామంటూ ఇటీవల నిర్మాతలు ప్రకటించిన నేపథ్యంలో .. మొదటి భాగం విడుదల అవడానికి మరింత టైమ్ పట్టేలా కనిపిస్తోంది.
మొదటి భాగం కంప్లీట్ చేయాలంటే.. మరికొన్ని సీన్స్ బాకీ ఉండిపోయాయి. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత బ్యాలెన్స్ పార్ట్ ను షూట్ చేసి… ఈ ఏడాది చివరలో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ సెకండ్ పార్ట్ 10 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగతా భాగాన్ని ఏ ఏడాది చివరలో గానీ.. వచ్చే ఏడాది కానీ.. షూట్ చేయబోతున్నారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ రెండు భాగాల్ని తెరకెక్కించబోతున్నారు.
ఇక ‘పుష్ప’ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే… రెండో భాగానికి మరో పవర్ ఫుల్ టైటిల్ ను ఖాయం చేయబోతున్నారట. అతి త్వరలో ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందట. మొదటి భాగానికి స్మగ్లర్, లారీ డ్రైవర్ అయిన పుష్పరాజ్ పేరు టైటిల్ గా పెడితే.. రెండో భాగానికి స్మగ్లింగ్ కింగ్ గా మారి .. మార్చుకున్న పేరు ను టైటిల్ గా పెట్టబోతున్నారని టాక్. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. రెండో భాగానికి ఏ టైటిల్ పెడతారు అనే ఆసక్తితో ఉన్నారు అభిమానులు. టీజర్ తో పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి రెండో భాగం టైటిల్ ఏంటో చూడాలి.
Must Read ;- ‘పుష్ప’ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉందంటోన్న మేకర్స్