పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సూపర్ సక్సెస్ హ్యాంగోవర్ లో ఉన్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 100కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా .. ఇంకా థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ సక్సెస్ తో .. పవన్ తదుపరి చిత్రాలకు కూడా బోలెడంత క్రేజ్ ఏర్పడిపోయింది.
క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ రీమేక్ మూవీస్ .. ప్రస్తుతం సెట్స్ మీదున్నాయి. అలాగే.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో పవర్ స్టార్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు.. అది కూడా తండ్రీ కొడుకులుగా… నటించబోతోన్నట్టు వార్తలొస్తున్నాయి.
అయితే ఈ సినిమాలో కూడా పవన్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్టు సమాచారం. ఆల్రెడీ పవన్ .. గబ్బర్ సింగ్, కొమరం పులి , సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో పోలీస్ గెటప్స్ లో అలరించిన సంగతి తెలిసిందే. అలాగే.. తాజాగా పవన్ నటిస్తోన్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో ఆయన పవర్ ఫుల్ హానెస్ట్ పోలీస్ మేన్ గా నటిస్తున్నారు. ఇక హరీశ్ శంకర్ సినిమాలో తండ్రి పాత్ర పోలీస్ గానూ, కొడుకు పాత్ర లెక్చరర్ గానూ నటిస్తారని తెలుస్తోంది. అలాగే.. సినిమాకి ‘సంచారి’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. కథ ప్రకారం ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తారని.. ఆ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియాలంటే.. కొద్దిరోజులు ఆగాల్సిందే.
Must Read ;- తొలిసారిగా 100 కోట్ల క్లబ్ లో పవన్ కళ్యాణ్