పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో క్యారెక్టర్ ఉంది. ఈ పాత్ర కోసం దగ్గుబాటి రానా, నాని, నితిన్, సుదీప్.. ఇలా కొంత మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే.. ఎవర్నీ ఫైనల్ చేసారనేది ఇంకా ప్రకటించలేదు కానీ.. దగ్గుబాటి రానా పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని ఈ నెల 21 న అంటే సోమవారం ప్రారంభించనున్నారని తెలిసింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ను జనవరి 2 నుంచి ప్రారంభించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ చిత్రానికి సంభాషణలు రాయడం విశేషం. ఈ క్రేజీ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళం వెర్షన్ లో పాటలు లేకపోయినా.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే.. పాటలు ఎక్స్ పెక్ట్ చేస్తారు.
అందుచేత మూడు లేదా రెండు పాటలను ఈ సినిమాలో పెట్టనున్నారని తెలిసింది. ఆల్రెడీ ట్యూన్స్ ఓకే చేయించుకున్నారట తమన్. ఈ సినిమాని ముందుగా సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. ‘వకీల్ సాబ్’ సమ్మర్ కి వస్తుందని టాక్ వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే.. ఈ సినిమాని సమ్మర్ తర్వాత రిలీజ్ చేయనున్నారని సమాచారం.
Also Read: పవన్ మూవీలో రానా నటిస్తున్నాడా.? లేదా.?