దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పెళ్లిసందడి మూవీకి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి దర్శకత్వం వహిస్తుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే ఎంపిక చేసి పూర్తి వివరాలను అఫిషియల్ గా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది.

రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో నటిస్తున్నారా..? ఇది నిజమా.? లేక పుకారా..? అనుకుంటున్నారా.? ఇది నిజంగా నిజం. ఈ చిత్రానికి తనికెళ్లభరణి దర్శకత్వం వహించనున్నారు. విభిన్న కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటిస్తుండడం విశేషం. ఆ ముగ్గురు రమ్యకృష్ణ, శ్రియ, సమంత అని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రంలో నటించేందుకు సమంత నో చెప్పిందట. ఇటీవల తనికెళ్లభరణి సమంతను కలిసి కథ చెప్పారట. కథ విని సమంత సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం.
ఆచితూచి సినిమాలు చేస్తున్న సమంత.. ఆల్రెడీ ఓ సినిమాకి ఓకే చెప్పిందట. అందుకనే.. డేట్స్ ప్రాబ్లమ్ వలనే ఈ సినిమాకి నో చెప్పిందని సమాచారం. సమంత నో చెప్పడంతో తనికెళ్ల భరణి మిల్కీబ్యూటీ తమన్నాకు ఈ స్టోరీ గురించి చెప్పడం.. ఆమె ఓకే అనడం జరిగిందని తెలిసింది. ఇందులో రమ్యకృష్ణ, శ్రియ, తమన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెర వెనకున్న దర్శకేంద్రుడు ఇప్పుడు తెర ముందుకు వస్తుండడం విశేషం.
Must Read ;- ఈ హీరోయిన్స్ తో రొమాన్సా.. నిజమేనా దర్శకేంద్రా?











