ప్రభాస్ ‘ఆదిపురుష్’ గా అవతారం ఎత్తబోతున్నారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రూపొందే ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తారు.
తన్హాజీ చిత్రం తీసిన ఓం రౌత్ సోమవారం నాడు ఒక లీకు ఇచ్చారు. మొత్తానికి ప్రభాస్ తో భారీ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఇవాళ (మంగళవారం) ఉదయం 7.11 కు ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందు ప్రకటించినట్టుగానే.. ఓం రౌత్ తన ట్విటర్ అకౌంట్ లో ‘ఆదిపురుష్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ చూస్తే.. సినిమా రామాయణానికి సంబంధించిన కథాంశంతోరూపొందుతుందని అర్థమౌతుంది. ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో హనుమంతుడి పాత్రకు కూడా బాగా ప్రాధాన్యం ఉండేట్లుగానే పోస్టర్ డిజైనింగ్ భావన కలిగిస్తుంది. చెడు మీద మంచి సాధించిన విజయం గా ఆదిపరుష్ చిత్రానికి ట్యాగ్ లైన్ పెట్టారు.
టీసిరీస పతాకంపై రూపొందుతున్న చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా.. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సూతర్, రాజేష్ నాయర్ లు నిర్మాతలు. ఈ చిత్రాన్ని హిందీతో పాటు, తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. సుమారు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇది రూపొందుతోందని సమాచారం.
ప్రభాస్ కెరీర్ లో ఇదొక చారిత్రాత్మకమైన చిత్రం అవుతుందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
Celebrating the victory of good over evil! #Adipurush#Prabhas @ItsBhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/zx5NXseX0G
— Om Raut (@omraut) August 18, 2020