అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై హీరోయిన్ ప్రణీత స్పందించింది. ఈ ఆలయ నిర్మాణానికి ఆమె తన వంతు విరాళాన్ని అందించింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఆమె లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించింది. ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్టు కావడంతో దీనికోసం నిధుల సేకరణకు రామ మందిర్ నిధి పేరుతో ట్రస్టు విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటికే అనేకమంది విరాళాలు ప్రకటించారు. కరోనా సమయంలో కూడా ప్రణీత స్పందించి తన వంతు సేవాకార్యక్రమాలు చేపట్టింది. తన వంతు విరాళంగా లక్షరూపాయలు ప్రకటించడంతో పాటు ఇతరులు కూడా తమవంతు విరాళాలు ప్రకటించాలని ఓ వీడియోను కూడా విడుదల చేసింది.
Must Read ;- రామతీర్థం రామునికోసం పూసపాటి అశోక్ వితరణ!











