దుర్మార్గులు కొందరు రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే.. వారిని పట్టుకోవడం చేతకాని వారంతా.. ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్త అయిన పూసపాటి అశోక్ గజపతి రాజు మీద నిందలు వేయడానికి సాహసించారు. ఆయన ప్రేరేపణతోనే తెలుగుదేశం కార్యకర్తలే.. రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారని అన్నారు. ప్రభుత్వమైతే ఏకంగా ఆయనను ఆలయ అనువంశిక ధర్మకర్త పదవినుంచి తొలగించింది. అదే సమయంలో ప్రభుత్వ దేవాదాయ శాఖ మంత్రి ఏకంగా.. కులం పేరు పెట్టి నానా తిట్లు తిట్టారు. ఇన్ని జరిగినా సరే.. పూసపాటి అశోక్ గజపతి రాజు మాత్రం.. ఆవేశానికి గురి కాలేదు. తన ఆవేదనను మాత్రం వెలిబుచ్చారు. అదే సమయంలో రాముడి పట్ల ఆయనలోని భక్తి ప్రపత్తులు కూడా సన్నగిల్లలేదు.
రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేస్తే.. ప్రభుత్వం ఖజానా నుంచి ఆలయ పునర్నిర్మాణానికి సొమ్ము కేటాయించి.. అక్కడితో తమకు ఇంకేం పాపం అంటదన్నట్టుగా ప్రభుత్వం చేతులు దులుపుకుంది. కానీ అశోక్ గజపతి రాజు మాత్రం.. లక్షా వెయ్యినూటపదహార్ల మొత్తాన్ని స్వామివారి విగ్రహ తయారీకోసం విరాళంగా సమర్పించుకున్నారు. ఈ మేరకు ఆయన చెక్కును తన వ్యక్తిగత హోదాలో.. దేవస్థానం కార్యనిర్వహణాధికారికి పోస్టు ద్వారా పంపారు. ఎవరు ఎన్ని నిందలు వేసినా.. సడలని తన భక్తిని చాటుకున్న అశోక్ తీరు పట్ల అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.
Must Read ;- రగిలిపోతున్న రాజులు.. వెల్లంపల్లి పోస్టుకు ఎసరేనా?
In service of Lord Shri Ramachandra🙏🙏🙏 pic.twitter.com/gUuHyvm5W6
— Ashok Gajapathi Raju (@Ashok_Gajapathi) January 11, 2021
తిరుపతిలో కోదండ రాముని విగ్రహం తయారీ
విజయనగరం : రామతీర్థంలో ధ్వంసమైన కోదండరాముని విగ్రహం తయారీని తిరుపతిలో ప్రారంభించారు. ఇందులో భాగంగా దేవదాయ శాఖ కాకినాడ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ భ్రమరాంబ, ఇతర అధికారులు రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటించారు. ఆగమ సలహాదారుల సూచనల మేరకు దేవదాయ శాఖ తితిదేని విగ్రహాలు తయారు చేయాలని కోరింది. తితిదే అధికారుల ఆదేశాల మేరకు ముగ్గురు స్థపతులు పూజాది కార్యక్రమాలు చేపట్టి విగ్రహాల తయారీ ప్రారంభించారు. ఇందులో శ్రీరాములవారి విగ్రహం పీఠంతో కలిపి మూడున్నర అడుగులు, సీతమ్మ, లక్ష్మణ స్వామి విగ్రహాలు పీఠంతో కలిపి మూడు అడుగులు తయారీ చేస్తున్నారు. ఈ విగ్రహాలు 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేసి దేవాదాయశాఖకు అప్పగించనున్నట్లు సమాచారం. నెలరోజుల్లోగా నూతన ఆలయం నిర్మించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా ముమ్మర చర్యలు చేపట్టింది.
Also Read ;- కర్నూలులో సీతారాముల విగ్రహం ధ్వంసం.. ఏకంగా హుండీనే మాయం!