హీరోయిన్‌ను ఎంచుకోవడంలో రాజమౌళి చాలా స్పెసిఫిక్ గా ఉంటారు. ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ కోసం అలాంటి సుదీర్ఘ కసరత్తు అనేకానేక ఆడిషన్ల తర్వాత.. ఆలియాభట్ ను అనుకున్నారు. ఇప్పుడు నెపోటిజం దెబ్బకు ఆమెపట్ల వ్యతిరేకత వల్ల పక్కకు తప్పించేశారు. కానీ రాజమౌళి మనసులో ఎవరున్నారు? ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ లలో రాజమౌళి మనసులో ఎవరున్నారో ఎప్పటికి తేలుతుంది.
బాలీవుడ్ హీరో సుశాంత్ మిస్టరీ మరణం తాలుకు సెగ మెల్లిగా టాలీవుడ్ ని కూడా తాకుతోంది. సుశాంత్ మరణం తరువాత నెపోటిజం పై బాలీవుడ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. హిందీ ఆడియెన్స్ బాలీవుడ్ నెపోటిజాన్ని సహించేది లేదంటూ అక్కడ ఉన్న సినీ వారసుల సినిమాలకి డిస్ లైక్స్ కొడుతున్నారు.
తాజాగా ఆలియా భట్ నటించిన సడక్ 2 ట్రైలర్ రిలీజ్ అయితే దానికి ప్రపంచలోనే చెత్త ట్రైలర్ గా స్టాంప్ వేసేశారు. ఈ ట్రైలర్ కి ఏకంగా 10 లక్షలకి పైగా డిస్ లైక్స్ కొట్టారు బీ టౌన్ నెటిజన్స్. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయిపోంది. సినీ వారసులంతా తమ సినిమాలకి సంబంధించిన ఎలాంటి పోస్టులు ఆన్ లైన్ లో రిలీజ్ చేయడం లేదు. అయితే సడక్ 2 లో నటించిన ఆలీయభట్ కి ఇంకా ఈ నెపోటిజం ఎఫెక్ట్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
అలియా భట్ ట్రిపుల్ ఆర్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మూవీ డైరెక్టర్ రాజమౌళి ఎన్నో ఆడిషన్స్ తరువాత ఆలియాను ఎంపిక చేసుకున్నాడు. అయితే బాలీవుడ్ లో ఇప్పుడు ఆలియాపై ఉన్న నెగిటివిటీ కారణంగా ట్రిపుల్ ఆర్ కూడా దెబ్బతినే అవకాశం ఉందని రాజమౌళి ఫీలై, ఆలియాను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించాడని తెలిసింది. ఈ బ్యూటీ ప్లేస్ ఎవరైనా నార్త్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్‌ని తీసుకోవాలన్నది జక్కన్న లేటెస్ట్ ప్లాన్. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరేవరు సెట్ అవ్వకపోతే సౌత్‌లో ఉన్న ఎవరైనా స్టార్ హీరోయిన్ తో ముందుకు వెళ్లాలని జక్కన్న నిర్ణయించుకున్నాడట.











