న్యాయవాద దంపతులు వామన రావు, నాగమణిల హత్యలు చాలా దారుణమని తెలంగాణ జనసేన సమితి వ్యవస్థాపకులు కోదండరాం ఆరోపించారు. వామన రావు పలు వివాదస్పదమైన కేసులను డీల్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై కోదండరాం మాట్లాడారు. అడ్వకేట్‌గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. ప్రజాప్రతినిధుల ఆస్తులకు సంబంధించన వాస్తవాలను బయటపెడ్తూ, భూ ఆక్రమణలను బహిర్గంతం చేస్తూ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేస్తూ.. ప్రజా ప్రతినిధుల అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేసేవారాని తెలిపారు.
ఇటీవల పెద్దపల్లిలో లాకప్‌లో చనిపోయిన శీలం రంగయ్య విషయంలో కోర్టులో కేసు వేశారు. దానికి సంబంధించన నివేదిక కోర్టుకు చేరినట్లు సమాచారం. ఇలా పలు రకాల కేసులతో నిజాలను వెలికితీస్తూ.. తన వృత్తిని కొనసాగిస్తున్న వామన రావుపై స్థానిక ప్రజాప్రతినిధులు కోపం పెంచుకున్నారు. ఈ హత్య వెనక స్థానిక నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. చనిపోతూ వామన రావు గారు చాలా స్పష్టంగా మరణ వాంగ్మూలం ఇచ్చారు అందులో టీఆర్‌ఎస్‌కు కుంటా శీను అనే వ్యక్తి ఉన్నట్లుగా తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అధికార పార్టీ కనుసన్నల్లోనే భూమాఫీయాలు పెరిగిపోయాయని.. అందుకు కొందరు పోలీసులు కూడా సహకరిస్తున్నారని కోదండరాం ఆరోపించారు.