వద్దు.. రావద్దు.. అంటూ అడ్డుకున్న ప్రజలు..!
రావాలి .. జగన్.. కావాలి జగన్ అన్న నోర్లే .. నేడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను మా ప్రాంతాల్లో తిరిగే నైతిక హక్కును కోల్పొయ్యారని తిట్టిపోస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, సొంతపార్టీ నేతలే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్నారు. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటే గౌడ కు చేదు అనుభవం ఎదురైంది. ‘‘వద్దు.. రావద్దు మా గడపకు రావద్దు .. సమస్యలు పట్టని ఎమ్మెల్యే మాకొద్దు’’ అంటూ గౌడ కు వ్యతిరేకంగా కొంగాటం గ్రామ ప్రజలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్రామంలో ఎమ్మెల్యే, సర్పంచ్ మా గడపకు రావొద్దు.. మీకో దండం సామీ అంటూ బ్యానర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే వెంకటే గౌడ సొంత మండలమైన వి.కోట లోనే ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం మరో కొసమెరుపు! మరోవైపు వాలంటీర్లు నిరసన వ్యక్తం చేశారు. నల్ల రిబ్బన్ ధరించి, బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. దీంతో సొంత మండల ప్రజలిచ్చిన షాక్ కు కంగుతిన్న ఎమ్మెల్యే వెనుదిరిగాడు!
ఎమ్మెల్యే రోజాపై ప్రజలు ఫైర్ ..
చిత్తూరు జిల్లా, నగరి ఎమ్మెల్యే రోజాపై సొంత పార్టీ నేతలు, నియోజకవర్గం ప్రజలు నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్తునే ఉన్నారు. ‘మీతో మీ ఎమ్మెల్యే’ పేరుతో నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా గతంలో నియోజకవర్గంలో పర్యటించారు. నిండ్రలో పర్యటిస్తున్న రోజాకు నిరసన సెగ ఒక్కసారిగా తాకింది. డోర్ టూ డోర్ తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న రోజాను ప్రజలు నిలదీశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ పథకంపై లబ్థిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పడో నిర్మించుకున్న ప్రభుత్వ ఇంటికి ఎందుకు పదివేలు చెల్లించాలని ప్రశ్నించారు. పది వేలు చెల్లిస్తే ఇల్లు సొంతమవుతుంది, ఎవరికైనా అమ్ముకొవచ్చని, బ్యాంకు రుణాలకు అర్హులవుతారని, ఇంటిపై పూర్తి హక్కులు వస్తాయని లబ్ధిదారులకు రోజా తమిళంలో వివరించే ప్రయత్నం చేశారు. అయినా రోజాకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేయడం గమనార్హం. మరోవైపు చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, సొంతపార్టీ జెడ్పీటీసీ భర్త మద్దిరెడ్డి కొండ్రెడ్డిల మధ్య పచ్చగడ్డెస్తే భగ్గుమంటుంది. తంబళ్లపల్లె ను ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తాలిబన్ రాజ్యంగా మార్చడని మీడియా సమావేశం పెట్టి మరి కొండ్రెడ్డి విమర్శించాడు. ఇలా చిత్తూరు జిల్లా అదికార వైసీపీ ఎమ్మెల్యేపై కేడర్ తో పాటు సొంతపార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Must Read:-వైసీపీ నేతల బూతులు మీకు వినసొంపుగా ఉంటాయా?











