విశాఖలో ఆ భూముల కోసమేనా?
విశాఖలో జగన్కు వేల ఎకరాల భూములు ఉన్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖపట్నంలో భూములను కూడకట్టారు. నేడు విశాఖలో ఆ భూములకు ధరలు రావాలంటే రాజధాని అక్కడే ఏర్పాటు చేయాలని జగన్ పన్నిన పన్నాగమే మూడు రాజధానులని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వైసీపీ పాలనలో దోచుకునే వ్యక్తే సీఎం అయితే.. రాష్ట్రానికి మంచి పాలన ఎలా అందుతోందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చమంటున్నారు. కానీ జగన్ ఏపీలో రాజ్యాంగానికి బదులు భారతి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు మండిపడ్డారు.
ప్రశ్నిస్తే హత్యలేనా?
రాష్ట్రంలో ప్రశ్నించే విపక్షాలు, మీడియా, పబ్లిక్ పై దాడి చేయడం వైసీపీ సర్వసాధారణంగా మారింది. పరిటాల రవిని చంపినట్లు తన హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి వాపోయ్యారు. సొంత బాబాయి వివేకానంద రెడ్డిని చంపి, ఆ కుట్రను పక్కవాళ్లపై మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వివేకా హత్యను ముందు చంద్రబాబు, ఆ తరువాత నాపై మోపాలని చూశారని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. వైసీపీ కుట్రలను, హత్య రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు.
Must Read:-చిత్తూరు జిల్లాలో వైసీపీ గల్లంతు! ఎమ్మెల్యేలకు నిరసన సెగలు! మా వద్దకు రావద్దయ్య సామీ అంటూ నినాదాలు!!











