పోలవరంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు నిష్టపరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు పిటిషనర్. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయం తెలపాలని పిటిషనర్ పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి, ఆర్థిక, నీతిఆయోగ్, ఏపీ సర్కార్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలను, ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్.
2013 పునరావాస చట్టం ప్రకారం బాధితులకు పరిహారం చెల్లించాలని తన పిటిషన్‌లో కోర్టుకు తెలిపిన పిటిషనర్. ప్రతి సంవత్సరం అంచనా వ్యయం మారుతున్నందున ఇబ్బందులు తలెత్తుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. రేపు విచారణ జరుపుతామని తెలిపిన న్యాయవాది.
Must Read ;- పోలవరం: ప్రాజెక్టును బ్యారేజీగా మార్చే కుట్ర నడుస్తోందా?











