మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం టీజర్ ఇటీవల రిలీజ్ కావడం.. ఈ టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఆచార్య పై అంచనాలు అధికమవుతున్నాయి. ఈ క్రేజీ మూవీని మే 13న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ మూవీని మే 14న విడుదల చేయనున్నట్టు ఎనౌన్స్ చేశారు.
ఇలా ఒక రోజు తేడాతో చిరు ఆచార్య, వెంకీ నారప్ప రిలీజ్ అవుతుండడం ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే.. దాదాపుగా భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేశారు కానీ.. నందమూరి నటసింహం బాలకృష్ణ – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ యాక్షన్ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది వెల్లడించలేదు. అయితే.. ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నట్టుగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ఎప్పుడైతే ఈ మూవీ నిర్మాణ సంస్థ ఇలా ఎనౌన్స్ చేసిందో.. బాలయ్య మూవీ చిరు ఆచార్యతో పోటీపడనుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఆచార్య మే 13న రిలీజ్ అయితే.. ఈ రిలీజ్ డేట్ కి రెండు రోజులు అటు ఇటుగా బాలయ్య సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇదే కనుక జరిగితే.. చిరు అభిమానులు, బాలయ్య అభిమానుల మధ్య మరింత పోటీ ఏర్పడి ఈ రెండు సినిమాల పై మరింతగా భారీ అంచనాలు ఏర్పడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Must Read ;- చిరు బాలయ్యలతో ‘మైత్రి’ సాగించబోతున్న భారీ నిర్మాణ సంస్థ











