కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈ వార్తను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈరోజు ఉదయం ఆయన జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలోని రమణశ్రీ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విక్రమ్ ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగానే కన్నుమూశారు.
కర్ణాటక సీఎం, డీజీపీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన మృతికి సంతాపంగా కర్ణాటకలోని థియేటర్లు మూసివేశారు. విక్రమ్ ఆస్పత్రికి ఆయన అభిమానులు భారీగా చేరుకున్నారు. 29 చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు. బాల నటుడిగానూ 14 చిత్రాలు చేశారు. కన్నడ కంఠీరవ మూడో కుమారుడైన పునీత్ రాజ్ కుమార్ కన్నడంలో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆయన వయసు 46 సంవత్సరాలు.
పునీత్ రాజ్ కుమార్ నివాసానికి సైతం భద్రత కల్పించారు. పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కుమార్తె నివేదిత.. పునీత్ కుటుంబ సభ్యులు.. క్రేజీ స్టార్ రవిచంద్రన్, నిర్మాతలు జయన్న, కేపీ శ్రీకాంత్ తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రికి చేరుకున్నారు. సోలో హీరోగా 2002లొ అప్పు సినిమాతో చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. దీనికి పూరి జగన్నాథ్ దర్శకుడు. తెలుగులో విజయవంతమైన ‘ఇడియట్’ ఆధారంగా దీన్ని పునర్నిర్మించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిపై మధ్యాహ్నం మూడు గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17న జన్మించారు. కన్నడ సినీ పరిశ్రమలో పవర్ స్టార్ గా ఈయన్ని చెబుతుంటారు. అలాగే అప్పు అనే ముద్దు పేరుతోనూ పిలుస్తుంటారు. ఐదేళ్ల వయసులోనే నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. తన తండ్రి రాజ్ కుమార్‌తోనూ కలిసి నటించారు. బాలనటుడిగా ఉత్తమ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఆ తర్వాత అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు.
నిర్మాతగా కొన్ని చిత్రాలు చేశారు. టీవీ కార్యక్రమాలకు హోస్ట్ గానూ, గెస్ట్ గానూ, న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు. అనేక సినిమాల్లో బాలనటుడిగా నటించారు. ఆయన మొదట్లో నటించిన అప్పు చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో రక్షిత హీరోయిన్. అంతకుముందు పరశురామ్ చిత్రంలోనూ అప్పు అనే పాత్రనే పోషించారు. అందుకే పూరి తన సినిమా టైటిల్ ను అప్పు అనే పెట్టారు. అదే ఆయనకు ముద్దు పేరుగా మారింది. ఆయన భార్య పేరు అశ్వనీ రేవంత్. వీరికి ఇద్దరు సంతానం. కర్ణాటకలో హైఅలెర్ట్ ప్రకటించారు.
పునీత్ మరణ వార్త తెలియగానే నా నోట మాట రాలేదు: మెగాస్టార్ చిరంజీవి
కన్నడ సినీ పరిశ్రమ ఒక స్టార్ హీరోను కోల్పోయింది. శుక్రవారం నాడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటు కారణంగా మరణించారు. జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు రావడంతో విక్రమ్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. పునీత్ మృతికి కేవలం శాండిల్ వుడ్ నుంచే కాక తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సెలబ్రిటీలు సైతం సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పునీత్ మృతి చెందిన విషయం మీద మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ “ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ అయ్యాను. పునీత్ మరణం రాజ్ కుమార్ గారి కుటుంబానికి తీరని లోటు.
చిన్న వయసులోనే పునీత్ కు ఇలా జరగడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. పునీత్ తనకు అత్యంత ఆప్తుడు, వారి కుటుంబంలోని వారంతా తనకు కావాల్సిన వారు. ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా తనను పునీత్ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణ వార్త తెలియగానే నా నోట మాట కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పునీత్ మరణ వార్త విని దిగ్బ్రాంతి చెందారు. తన సంతాపాన్ని ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఈ వార్త తెలిసిన వెంటనే నివ్వెరపోయింది. పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాలను ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ తదితరులు కూడా తమ సంతాపాన్ని పకటించారు.











