నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ ఎంపీ, లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. వెంటనే రఘురామరాజు సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ నుంచి గెలవడమే కాకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఎంపీ రఘురామరాజుపై ఫిర్యాదు చేశారు. జగన్ ఢిల్లీ టూర్ ముగియగానే ఆ పార్టీ ఎంపీలు రంగంలోకి దిగడం చర్చానీయాంశంగా మారింది.
గతంలో కూడా ఫిర్యాదు..
గత ఏడాది అక్టోబర్ 11న కూడా వైసీపీ ఎంపీలంతా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకరుకు ఎంపీ రఘురామరాజుపై ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘురామరాజు వైసీపీ నుంచి గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వారంతా మూకుమ్మడిగా వెళ్లి ఫిర్యాదు చేశారు. అయినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై రఘురామరాజు గతంలోనే స్పందించారు. వైసీపీ ఎంపీలు ప్రత్యేక విమానం వేసుకుని ఢిల్లీ వచ్చినా తన సభ్యత్వం పీకలేరని సవాల్ విసిరారు. తాను తన కష్టంతో గెలిచానని, ఎవరు ఫోటోతో గెలవలేదని ఆయన గతంలోనే తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా మరోసారి వైసీపీ ఎంపీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
Must Read ;- చిత్రహింసలు పెట్టారు.. స్పీకర్‌కు రఘురామరాజు ఫిర్యాదు











