రామ నామం లేకుండా సినిమా రంగం ఉండదేమో. ఒక తరంలో సినిమా రంగాన్ని శాసించిన పేరిది. మహానటుడు నందమూరి తారక రామారావు నట వారసత్వం మూడో తరంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వారసత్వం రూపంలో వచ్చింది. ఇప్పుడు ఈ జూనియర్ కు మరో ఇద్దరు జూనియర్ లు తోడయ్యారు. అభయ్ రామ్, భార్గవ్ రామ్.. ఉభయ తారకంలా ఉండేలా తారక్ ఈ పేర్లు పెట్టినట్టే అనిపిస్తోంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే జూన్ 14వ తేదీ నందమూరి వంశంలో నాలుగో తరం వారసుడు భార్గవ్ రామ్ పుట్టిన రోజు.

సాధారణంగా తన కుమారుడి పుట్టిన రోజు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఫొటోని షేర్ చేస్తారు. కానీ ఈసారి అలా చేయలేదు. ఇది ఎన్టీఆర్ అభిమానులను కొంత నిరుత్సాహాన్ని కలుగజేసింది. ఎన్టీఆర్ 2019లో షేర్ చేసిన ఫోటోనే వైరల్ అయ్యింది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ వచ్చే నెల.. అంటే జులై 22వ తేదీన పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. చిన్న కుమారుడు భార్గవ్ రామ్ పుట్టిన రోజైన జూన్ 14న మాత్రం ఎలాంటి హడావుడి కనిపించలేదు. భార్గవ్ రామ్ తో కలిసి ఉన్న ఫొటోను తారక్ షేర్ చేస్తారేమోనని అభిమానులు ఎంతో ఎదురుచూశారు.
మొత్తానికి మే, జూన్, జులై నెలలు వరుసగా నందమూరి కుటుంబానికి పెద్ద పీట వేశాయనే చెప్పాలి. ఎందుకంటే మహానటుడు ఎన్టీఆర్ జయంతి మే 28వ తేదీ. అచ్చు ఆయనను పోలేలా ఉండే జూనియర్ ఎన్టీఆర్ మే 20న జన్మించారు. ఇక జూన్ నెల విషయానికి వస్తే ఎన్టీఆర్ రెండో తరం వారసుడు నందమూరి బాలకృష్ణ జూన్ 10వ తేదీన జన్మించారు. భార్గవ్ రామ్ పుట్టిన రోజు జూన్ 14 అని తెలిసిందే. ఇక జులై 5న నందమూరి కళ్యాణ్ రామ్, జులై 22న అభయ్ రామ్ జన్మించారు.
ఇలా చూసినప్పుడు నందమూరి వారసుల్లో చాలామంది ఈ మూడు నెలల్లోనే జన్మించారు. కళ్యాణ్ రామ్ సోదరుడు జానకి రామ్ పుట్టింది జూన్ 4వ తేదీ. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మూడేళ్ల భార్గవ్ రామ్ ఎలా ఉంటాడా అన్న తహతహ అభిమానుల్లో ఉంది. ఎన్టీఆర్ అభిమానులు అతనికి లిటిల్ టైగర్ అనే పేరు కూడా పెట్టేశారు. తన ఇద్దరు కుమారులతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఓ ఫొటోను విడుదల చేస్తే బాగుంటుందేమో. అభిమానులు మత్రం దీన్ని ఓ పండుగలానే జరుపుకున్నారు.
Must Read ;- బాలయ్య మాటలకు వక్ర భాష్యం.. యువతకు ప్రాధాన్యమంటే జూనియర్ ఎన్టీఆర్‌కు వెల్ కమ్ చెప్పినట్లు కాదా?











