వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు లేఖల యుద్ధం కొనసాగిస్తున్నారు. నిన్న సీఎంలకు లేఖలు రాసిన రఘురామ ఇవాళ గవర్నర్లకు, లెప్ట్‌నెంట్ గవర్నర్లకు లేఖలు రాశారు. ప్రజా సమస్యలు ప్రభుత్వానికి అర్థం అయ్యేలా చేస్తే, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి తనపై వ్యక్తిగత కక్ష పెంచుకుని రాజద్రోహం కేసులు పెట్టారని గవర్నర్లు, లెప్ట్‌నెంట్ గవర్నర్లకు రాసిన లేఖలో రఘురామరాజు పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఒక ఎంపీపై రాజద్రోహం కేసులు పెట్టి పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన లేఖలో వెల్లడించారు.
ఆ సదస్సులో ప్రస్తావించండి
అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెప్ట్‌నెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి నిర్వహించే సమావేశంలో తనపై అన్యాయంగా పెట్టిన రాజద్రోహం కేసు విషయాలను ప్రస్తావించాలని ఎంపీ రఘురామరాజు లేఖలో విజ్ఙప్తి చేశారు. సెక్షన్ 124ఏ రాజద్రోహం కేసు రద్దుపై కూడా చర్చించాలని గవర్నర్లకు రాసిన లేఖలో ఎంపీ కోరారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి, లోపాలను వివరించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని రఘురామరాజు గవర్నర్లకు రాసిన లేఖలో గుర్తు చేశారు. అక్రమ కేసుల్లో అరెస్టు చేయడంతోపాటు, ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్‌తో పాటు మరో ఐదుగురు ముసుగులు ధరించి తనపై విచక్షణా రహితంగా ప్లాస్టిక్ కర్రలతో కొట్టి చిత్రహింసలకు గురి చేశారని రఘురామరాజు లేఖలో తెలిపారు.
Must Read ;- జగన్ మినహా సీఎంలందరికీ రఘురామరాజు లేఖలు











