కాంగ్రెస్ నాయకురాలు, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆమె సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెళ్తున్న కార్లు చిన్నపాటి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. వారిరువురు, గణతంత్ర దినోత్సవాలనాడు దేశ రాజధానిలో జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయిన నవ్రీత్ సింగ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ వెళ్తుండగా వాళ్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని నాలుగు కార్లు ఒకదానితో మరొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
రాహుల్, ప్రియాంకలతో పాటు మరి కొందరు నాయకులు కూడా వారితోపాటు ఉత్తర్ ప్రదేశ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. 24వ నెంబరు జాతీయ రహదారిలో హాపూర్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్లు, సంఘటనలో అందరూ క్షేమంగా బయటపడినట్లు తెలుస్తోంది.
Must Read ;- ఒక్క ట్వీట్ తో హీటు పెంచిన రాహుల్!











