పాన్ ఇండియా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మల్టీస్టారర్ సినిమా మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. అసలు ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుంది? ఎప్పుడు పూర్తవుతుంది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం రాజమౌళి నోటివెంట నుంచి వస్తే తప్ప స్పష్టతలేదు. ఆయన దీనిపై స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించారు. పైగా ఆయన కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానంపై ప్రకటన కూడా చేశారు. కానీ ఇవ్వడం కుదరలేదు. లాక్ డౌన్ తర్వాత ఆయన కోలుకుని తన భార్య రమతో కలిసి బందీపూర్ లోని రిసార్ట్ కు వెళ్లారు.
పైగా ఆయన పుట్టి పెరిగింది కర్ణాటకలోనే. ఒక విధంగా బందీపూర్ కు వెళ్లడం తన సొంతూరుకు వెళ్లినట్లు అనిపించిందంటారాయన. 50 శాతం సీటింగ్ తో సినిమా థియేటర్లను ప్రారంభించడం కరెక్టు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్ఆర్ఆర్ షూటింగును హైదారాబాద్ లోనే ఆయన చేస్తారట. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు కూడా తెలిపారు. రెండు నెలల పాటు కంటిన్యూ గా షూటింగ్ ఉంటుందని చెప్పారు.
సినిమా విడుదల తేదీ మీద అప్పుడే స్పష్టత వస్తుందని, ఇప్పుడే ఏమీ చెప్పలేనని అన్నారు. చెర్రీ ఫ్యాన్స్ కు ఇచ్చినట్లు గానే తారక్ ఫ్యాన్స్ కు కూడా త్వరలోనే ట్రీట్ ఇవ్వనున్నారట. ఈ సినిమాలో ఉండే పాత్రకు ఆలియా భట్ అయితేనే కరెక్ట్ అని తీసుకున్నట్లు చెప్పారు. ఆమె వ్యక్తిగత జీవితం తమ సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపదని భావిస్తున్నానన్నారు. మహాభారతాన్ని కచ్చితంగా తెరపైకి ఎక్కిస్తానన్నారు. అందులో తనకు కర్ణ పాత్ర అంటే చాలా ఇష్టమని చెప్పారు.











