Ramadan 2021
ముస్లీంల పవిత్ర పండుగ అయిన రంజాన్ మొదలైంది. మంగళవారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో బుధవారం బుధవారం నుంచి ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టారు. ముస్లిం సోదరులు రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. సూ ర్యోదయం కంటే ముందు భోజనం చేసి తర్వాత సూర్యాస్తమయం వరకు కనీసం లాలాజలం కూడా మింగకుండా ఉపవాస దీక్షలను ఆ చరిస్తారు.
Ramadan 2021 :
ఈ మాసంలో ప్రత్యేకంగా చేసే హలీం, కూర్మలకు ఎంతో ప్రత్యేకత ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని మత పెద్దలు సూచించడంతో, ఈ మేరకు పలు జాగ్రత్తలు తీసుకోనున్నారు ముస్లింలు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ ప్రార్థనలు చేయనున్నారు.
Must Read ;- ఈ ఉగాది సుఖ సంతోషాలను ఇవ్వాలి : చంద్రబాబు











