సినిమా సెలబ్రిటీల వివాహమంటేనే అదో పెద్ద సందడి. అలాంటి దగ్గుబాటి రానా వివాహానికి మాత్రం కరోనా నిబంధనలు అడ్డొచ్ఛాయి. ఈరోజే రానా, మిహికల వివాహం జరుగనుంది. రానాకు అత్యంత దీనికి హైదరాబాద్ రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. మరోవైపు పెళ్లికి మూడు రోజుల ముందే ప్రారంభమైన ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో అటు రానా ఇంట, ఇటు రానాకు కాబోయే భార్య మిహికా బజాజ్ ఇంట సందడి వాతావరణం నెలకొంది. నిజానికి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆహ్వానించి రానా పెళ్లిని అత్యంత ఘనంగా చేయాలనుకున్నారు ఆయన తండ్రి సురేష్ బాబు. కరోనా కల్లోలంలో అది సాధ్యపడక కేవలం ఇరు కుటుంబాల సమక్షంలోనే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఈ వేడుకను పూర్తిచేయబోతున్నారు. ఈ క్రమంలో రానా పెళ్లి వేడుకల గురించి స్పందించిన సురేష్ బాబు.. తన కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయలేకపోతున్నామనే బాధ మాత్రం ఉంది కానీ తప్పడం లేదని అన్నారు. “రానా- మిహిక బజాజ్ పెళ్లి కార్యక్రమాలు తెలుగు సంప్రదాయాలు, మార్వాడీ సంప్రదాయల ప్రకారం జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల ఆచారాలను పాటిస్తూ పెళ్లి వేడుకను జరపబోతున్నాం. ప్రమాదకర కరోనా వ్యాధి వ్యాప్తి కారణంగా సురక్షిత చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నాం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పెళ్లిలో సురక్షిత చర్యల విషయంలో రాజీ పడటం లేదు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత గ్రాండ్‌గా విందు ఏర్పాటు చేస్తాం” అని సురేష్ బాబు తెలిపారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలలో భాగంగా హల్దీ, మెహందీ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కినేని కోడలు సమంత ఈ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే.
మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...










