సాధారణంగా మన కంపెనీలో పనిచేసి మానేసిన ఉద్యోగికి ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తారు? ఫోన్ చేసి విచారిస్తాం. అంతకు మించి ఎవరు చేయరు. వ్యక్తిగతంగా దగ్గరైన వ్యక్తైతే నేరుగా వెళ్లి పరామర్శిస్తాం. కానీ ఒక సాధారణ మాజీ ఉద్యోగికి అంత విలువ ఇవ్విం. అందరూ అలా ఉంటారనకుంటే పొరపాటే.. దేశంలోనే వ్యాపారదిగ్గజంగా పేరు గాంచిన రతన్ టాటా, ముంబై నుండి పుణెకి వెళ్లి మరీ ఒక సాధారణ మాజీ ఉద్యోగి అనారోగ్యాన్ని విచారించారు.
ఆరోగ్యం ఎలా ఉంది?
రతన్ టాటా.. పరిచయం అవసరం లేని పేరు. కోట్ల సంపాదించారు.. వ్యాపార దిగ్గజంగా పేరు ఘడించారు. కానీ, ఎంత ఎత్తుకు ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలనే పాలసీకి నిలువెత్తు సాక్ష్యం ‘రతన్ టాటా’. 83 సంవత్సరాలు వయస్సులో.. అది కరోనా సమయంలో ఇలా చేయాల్సిన అవసరం లేదు. కానీ, కంపెనీ కోసం పనిచేసిన వ్యక్తి 2 సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఆ వ్యక్తిని పరామర్శించి క్షేమ సమాచారాన్ని విచారించడం తన బాధ్యతగా భావించాడు. అందుకోసం ముంబై నుండి పుణె చేరుకుని నేరుగా తనే అతని ఇంటికి వెళ్లి మరీ అతని పరిస్థితిని అడిగితెలుసుకున్నాడు.
Must Read ;- శర్మగారి అబ్బాయి బీఫ్ తిన్నాడా? ట్వీట్ల దుమారంలో నిజమెంత?
డబ్బు కాదు.. మానవతా విలువలు ముఖ్యం
అప్పుడప్పుడూ ఇలాంటి వ్యక్తులను చూసినపుడు తెలుస్తుంది.. డబ్బు కన్నా మానవతా విలువలు ఎంత ముఖ్యమనేది. రతన్ టాటా పరామర్శించిన విషయాన్ని ఒక ఉద్యోగి తన లింక్డ్ఇన్ ద్వారా తెలపడంతో.. అది కాస్తా నెట్‌లో వైరల్‌గా మారింది. ’83 ఏళ్ల రతన్ టాటా గారు ముంబై నుండి పుణె వచ్చారు. ముఖ్యమైన మీటింగ్ కోసం కాదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మాజీ ఉద్యోగిని చూడడానికి మాత్రమే. బహుశా లెజెండ్స్ అని ఇలాంటి వారినే అంటారేమో.. ఎటువంటి హంగు, ఆర్భాటం లేకుండా.. సెక్యూరిటీ అనే మాటే లేకుండా.. చాలా సాధారణంగా ఒక మాజీ ఉద్యోగిని కలవడానికి వచ్చారు. ఇలాంటి వాళ్ల నుండి నేటి వ్యాపారవేత్తలే కాదు.. సాధారణ పౌరులు కూడా ఎంతో నేర్చుకోవాలి. డబ్బు కంటే మానవత్వం ముఖ్యం అని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నాను.’ అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టాడు.
హ్యాట్సాఫ్.. రతన్ టాటా..
ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు రతన్ టాటా చర్యపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హ్యట్సాఫ్ రతన్ టాటా అంటూ సెల్యూట్ చేస్తున్నారు. ఈ కాలంలో పనిచేసే ఉద్యోగులనే పట్టించుకోవడం లేదు.. అటువంటిది మాజీ ఉద్యోగి కోసం వేరే ప్రాంతానికి స్వయంగా ఈ వయస్సులో వెళ్లి మరీ విచారించడం నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. ఈ వ్యాపార దిగ్గజాన్ని చూసి నేటి తరం ఎంతో నేర్చుకోవాలని చెప్తున్నారు.