పేకాట ఆడుతున్న వారిపై కాస్త గట్టిగానే కొరడా ఝులిపిస్తుంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా జరిగిన రైడ్స్ లో మహిళలు పట్టుబడడం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. జిల్లా కేంద్రమైన విజయనగరంలోని ఉల్లివీధిలో పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన తొమ్మిది మంది. వీరిలో ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. విజయనగరం ఉమెన్ పోలీసు స్టేషన్ ఎస్ఐ నేతృత్వంలో సిబ్బంది మెరుపు దాడిలో పట్టుబడిన వీరి నుండి 30,300 నగదు స్వాధీనం చేసుకుని కేసును వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు.
Must Read ;- పవనే కరెక్టా? పేకాట బురదలోంచి నాని బయటపడేనా!











