రజనీ బెక్టార్.. 2020 సంవత్సరంలో ఐపిఓలో స్థానం సంపాదించుకున్న మహిళగా పేరు తెచ్చుకుంది. మరి రజనీ కథ తెలుసుకోవాలంటే.. స్వాతంత్రం రాకముందు.. మన దేశం అఖండ భారతంగా విలసిల్లుతున్న సమయంలో మొదలైంది రజనీ ప్రస్థానం. పాకిస్తాన్, భారత్ నుండి విడిపోని సమయంలో కరాచీలో జన్మించారు రజనీ. తన చిన్నతనమంతా లాహోర్‌లో గడిచింది. భారత్-పాకిస్తాన్ వేరుపడిన తర్వాత రజనీ కుటుంబం ఢిల్లీకి తరలివచ్చింది. 17 ఏళ్ల వయసులో ధరమ్‌వీర్ బెక్టార్‌ను వివాహాం చేసుకున్న రజనీ.. ఆపై కుటుంబ వ్యవహారాలే లోకంగా బ్రతికారు. పిల్లలు కాస్త పెద్దవాళ్లే స్కూల్‌కి వెళ్లగానే.. తన కాలి సమయాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. కానీ అందుకు ఏం చేయాలి, ఎలా చేయాలో తెలియలేదు. అదే సమయంలో తనకు గల కుకింగ్ అభిరుచి మెరుగులుదిద్దాలని నిర్ణయించుకున్నారు.
వంటతో ప్రపంచ దేశాల మన్ననలందుకుంది
అందుకోసం పంజాబ్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో బేకింగ్ కోర్స్‌లో చేరింది. అక్కడ కోర్సు చేస్తూ.. ఐస్ క్రీమ్స్, కేక్స్, కుకీస్.. ఇలాంటి వాటితో లోకల్‌గా జరిగే సంత లాంటి వాటిలో అమ్మేవారు. తన ప్రతిభను గమనించిన ఆమె భర్త ధరమ్‌వీర్ బెక్టార్ బిజినెస్ మొదలుపెట్టమని సలహా ఇచ్చారు. తన అభిరుచికి భర్త సహకారం తోడవడంతో మరొక ఆలోచన లేకుండా 1970లలో 20000 పెట్టుబడితో ఇంటి వెనకల ఉన్న స్థలంలో ‘క్రీమిక’ పేరుతో బేకరీ బిజినెస్ మొదలుపెట్టారు రజనీ. క్యాటరింగ్స్, పార్టీలు, ఈవెంట్స్ వంటి వాటికి సప్లై చేయడానికి ఆర్డర్లు వచ్చేది.
Must Read ‘=పాకిస్తాన్‌లో బయటపడ్డ 1300 ఏళ్లనాటి పురాతన హిందూ ఆలయం
మలుపుతిప్పిన మెక్డోనాల్డ్ ..
1990 ల మధ్య కాలంలో ఇండియాలోకి అడుగుపెట్టబోతున్న మెక్డోనాల్డ్ కంపెనీ ‘క్రీమిక’తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది. అంతేనా, క్వాకర్ ఓట్స్‌తో కూడా ఒప్పందాలు కుదిరాయి. ‘క్వాకర్ క్రీమిక ఫుడ్స్’ పేరుతో కెచప్, మాయోనెస్.. ఇలా ఫుడ్ కండిమెంట్స్ ఉత్పత్తి చేసేవారు. వీటితో పాటు క్యాడ్బరి, ఐటిసీ వంటి దిగ్గజ కంపెనీలుతో చేతులు కలిపారు. 1999లో క్వాకర్ ఓట్స్ తన పార్టనర్ షిప్ నుంచి తప్పుకోవడంతో ‘క్వాకర్ క్రీమిక ఫుడ్స్’ కాస్త ‘మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్’గా రూపాంతరం చెందింది. అయినా తన మార్కెట్‌లో ఎటువంటి మార్పు రాకపోవడం గమనార్హం. పైగా 7 ఏళ్లలో, 2006 నాటికి సంస్థ 100 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ఆపై మిసెస్ బెక్టర్స్ అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. సంవత్సరానికి 30 శాతం పెరుగుదల నమోదు చేసుకుంటూ 2020 నాటికి 1000 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది.
60 దేశాలకు విస్తరించింది..
2013 తన ముగ్గురు కుమారులకు బిజినెస్ అంతటిని అప్పగించిన రజనీ.. నేటికీ ఈ బిజినెస్‌లో తనదైన ముద్రను కొనసాగిస్తున్నారు. ఐపిఓ రిపోర్ట్ ప్రకారం ‘మిసెస్ బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్’ సంస్థ మొత్తంగా 1000 కోట్ల బిజినెస్‌ను నమోదైనట్లు ప్రకటించింది. అంతేగా ‘మోస్ట్ సక్సెస్ ఉమెన్’గా రజనీ ప్రపంచవ్యాప్త మన్ననలు అందుకుంది. ప్రస్తుతం మిసెస్ బెక్టర్స్ 60 దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. దాదాపు 4,000 వేల మంది పనిచేస్తున్నారు.
చదువుతుంటూనే వావ్ అనిపిస్తుంది కదూ ఈ కథ.. మహిళలకు కనీస ప్రాధాన్యం లేని సమయంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. ప్రపంచ దేశాలలో ఓ వ్యాపార దిగ్గజంగా ఎదిగారు ‘రజనీ బెక్టర్’. తన కథ మనలో కొందరిలోనైనా స్ఫూర్తి నింపుతుందనడంలో సందేహం లేదు.
Also Read ;- ఓ తల్లి ఆలోచనకు రూపమే ఈ ‘మసాలా బాక్స్’