మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్.. గ్రేట్ డైరెక్టర్ శంకర్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నట్టు ఫిబ్రవరిలో అఫిషియల్ గా ప్రకటించారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల షూటింగ్ పూర్తైన తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు. అయితే.. శంకర్ భారతీయుడు 2 సినిమాని ఇంకా పూర్తి చేయలేదు. అందుచేత భారతీయుడు 2 పూర్తి చేయకుండా మరో సినిమా చేయకూడదు అంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా కోర్టుకెక్కింది.
దీంతో రామ్ చరణ్ తో శంకర్ చేయనున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి బ్రేక్ పడినట్లు అయ్యింది. భారతీయుడు 2 పూర్తి చేసిన తర్వాతే రామ్ చరణ్ తో మూవీ స్టార్ట్ చేయాలి అంటే.. చాలా టైమ్ పట్టచ్చు. అందుచేత ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లదు అనుకున్నారు. అయితే.. కోర్టు శంకర్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఒక దర్శకుడిని మరో సినిమా చేయద్దు అని చెప్పలేం అని తేల్చేసింది. దీంతో శంకర్ రామ్ చరణ్ తో సినిమాను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడేందుకే రామ్ చరణ్, దిల్ రాజు, శంకర్ చెన్నైలో కలిశారని సమాచారం.
ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ఈ సినిమాని స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలిసింది. శంకర్ ఆల్రెడీ స్ర్కిప్ట్ రెడీ చేసి చరణ్ ఎప్పుడంటే.. అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో కథానాయిక విషయానికి వస్తే.. కియారా అద్వానీ, ఆలియా భట్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకర్ని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని తెలిసింది. మరి.. ఈ సినిమాతో చరణ్ ఏ రేంజ్ సక్సస్ సాధిస్తారో.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో.. చూడాలి.
Must Read ;- ఆర్ఆర్ఆర్ ను ఫాలో అవుతున్న రాధేశ్యామ్











