ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కళ్లు మూసినా, తెచిరినా కూడా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దారుణాలే కనిపిస్తూ ఉన్నట్లున్నాయి. జగన్ జమాపాలో అందరి కంటే కూడా ఎక్కువ ఇబ్బందులకు గురి అయిన వ్యక్తి ఏబీవీనే. అందుకే కాబోలు జగన్ దారుణాలను మరిచిపోదాని ఏబీవీ ఎంతగా అనుకున్నా కూడా సాధ్యపడటం లేదు. వేదిక ఏదైనా కూడా ఏబీవీ…జగన్ అరాచకాలనే గుర్తు చేసుకుంటూ సాగుతున్నారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఓ ఆత్మీయ వేడుకలో పాలుపంచుకున్న సందర్భంగా కూడా ఏబీవీ నాటి అనుభవాలను మరోమారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నోట నుంచి సంచలన వ్యాఖ్యలు వెలువడ్డాయి.
కొసరాజు వారి వంశవృక్ష సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో కొసరాజు తొమ్మిదో ఆత్మీయ సమావేశం జరిగింది,. ఈ సమావేశానికి ఏబీవీ సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రసంగించిన ఏబీవీ… .జగన్ తన పాలనలో ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. జగన్ చేతికి అదికారం వచ్చిన నాటి నుంచి ఒక సామాజిక వర్ంపై కక్ష కట్టినట్టుగా వ్యవహరించారని అన్నారు. సదరు సాామాజిక వర్గాన్ని పూర్తిగా అణచివేయాలన్న ధోరణితోనే జగన్ సాగారన్నారు. ఈ కారణంగా సదరు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది అకారణంగా ఇబ్బందులపాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నంతకాలం జగన్ ఒక సామాజిక వర్గానికి చెందిన అదికారులను దాదాపుగా యుద్ధం ప్రకటించినట్లుగా వ్యవహరించారన్నారు. అందులో బాగంగా జగన్ అధికారంలోకి రాగానే తనతో పాటుగా చాలా మంది అధికారులు సస్పెండ్ అయ్యారన్నారు. చివరకు కరోనా టీకాకు, ఎన్నికల కమిషనర్ కూ కులం రంగు అంటించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏబీవీ చెప్పినట్లుగానే… జగన్ తన పాలన అంతా ఓ సాామాజిక వర్గాన్ని అణచివేసే దిశగానే సాగింది. దాదాపుగా అన్ని కీలక స్థానాల్లో తన సొంత సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించుకున్న జగన్… తాను టార్గెట్ చేసిన సాామాజిక వర్గానికి చెందిన అధికారులను గుర్తించి మరీ వేదింపులకు పాల్పడే కార్యక్రాన్ని నిర్విఘ్నంగా సాగించారన్న ఆరోపణలున్నాయి. ఈ కారణంగా జగన్ టార్గెట్ చేసిన సామాజిక వర్గానికి చెందిన చాలా మంది అధికారులు హడలెత్తిపోయారు. అవసరం ఉన్నా… లేకున్నా కూడా లీవులు పెట్టి మరీ తప్పించుకునే యత్నాలు చేశారు. కీలక స్థానాల్లో పనిచేసిన కొందరైతే… ఏకంగా విదేశాలకు కూడా వెళ్లిపోయారు. జగన్ సీఎంగా పదవి దిగిపోయాక గానీ… వారంతా తిరిగి తమ స్థానాలకు తిరిగి రాలేకపోయారు.
ఇక ఏబీవీ విషయాన్నే తీసుకుంటే… జగన్ అదికారంలోకి రాగానే… ఏబీవీని బదిలీ చేశారు. పోస్టింగ్ ఇవ్వకుండా డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొన్నారంటూ ఏబీవీపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏబీవీని విచారారించాలని పలుమార్లు ప్రయత్నించారు. అయితే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కొనసాగిన ఏబీవీ… జగన్ సర్కారుకు ఎదురొడ్డి పోరాడారు. జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలపై కోర్టుకెక్కారు. కిింది కోర్టుల్లో వచ్చిన తీర్పులను జగన్ సర్కారు పట్టించుకోకపోవడంతో నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరకు జగన్ సీఎంగా ఉండగానే… జగన్ సర్కారుపై ఏబీవీ విజయం సాధించారు. అయినా కూడా ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ సర్కారు తాత్సారం చేసింది. ఆఖరికి రిటైర్ అయ్యేందుకు మాత్రమే ఓ పోస్టును దక్కించుకున్న ఏబీవీ…నిబంధనల మేరకే పదవీ విరమణ పొందారు. అయితే పదవీ విరమణ ప్రయోజనాలను అందించడంలోనూ జగన్ సర్కారు తనదైన శైలి పక్షపాతాన్నే