రైతుల కష్టాలను, ప్రభుత్వ నిర్ణయాలను దుయ్యబడుతూ మాట్లాడిని రేవంత్ రెడ్డి.. ప్రభుత్వం ఆదేశించిన పంటను వేసిన రైతులకు ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతికున్న రైతులకు మద్దతు ధర ప్రకటించకుండా.. చనిపోయాక బీమా ఇస్తామనడం సమంజసం కాదని అన్నారు. కప్పగండ్లలో 400 ఎకరాల గిరిజనుల భూములను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆ భూములను తిరిగి వారికి అప్పగించాలి. అలా చేయని పక్షంలో వారి తరపున పోరాడడానికి ఏమాత్రం వెనకడుకువెయ్యం.
కందుకూరు, కడాల్ రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జైకిసాన్ పేరులో కాంగ్రెస్ భవిష్యత్తు కార్యచరణ రూపొందిస్తోంది. లాల్ బహుదూర్ శాస్త్రి నినాదం ఇప్పుడు మళ్లీ అవసరం వచ్చింది. రైతుల ఎజెండాతో ఈ కార్యచరణ ఉంటుందని తెలిపారు. కార్యచరణ పూర్తి వివరాలు తొందరలోనే వెల్లడిస్తానని తెలియజేశారు.
Must Read ;- లీడర్లకు షాక్..శ్రేణుల్లో జోష్: రేవంత్ రైతు భరోసా యాత్ర