‘హృదయ కాలేయం’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో బర్నింగ్ స్టార్ గా తిష్ట వేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. కామెడీ ప్లస్ వెటకారం కలగలిసిన ఆ సినిమా సంపూకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘కొబ్బరి మట్ట, సింగం 123’ లాంటి సినిమాలతోనూ ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. దాని తర్వాత ‘వైరస్’ అనే మరో సినిమా మొదలు పెట్టాడు. రీసెంట్ గా ‘బజార్ రౌడీ’ టైటిల్ తో ఇంకో సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పడు ఏకంగా ‘క్యాలీ ఫ్లవర్’ అనే డిఫరెంట్ టైటిల్ తో సంపూ .. కామెడీ తో చంపేయబోతున్నాడు. టైటిల్ లోనే బోలెడంత వెటకారం ధ్వనిస్తోంది.
నేడు సంపూర్ణేష్ బాబు బర్త్ డే సందర్భంగా ‘క్యాలీ ఫ్లవర్’ సినిమాకి సంబంధించిన ఫస్ట్ బ్యాంగ్ పేరుతో ఒక మోషన్ పోస్టర్ లాంటి వీడియో ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘స్వతంత్రం తెచ్చి గాంధీజీ చరిత్ర సృష్టించాడు. గోదారిపై ఆనకట్ట కట్టించి సర్ ఆర్దర్ కాటన్ చరిత్రకెక్కాడు. అదే కాలంలో భారత దేశంలో స్త్రీ పవిత్రతను ప్రపంచానికి తెలియచెప్పడానికి ఓ మహానుభావుడు గుర్రమెక్కి ఇంగ్లండ్ నుంచి ఇండియాకొచ్చాడు. అతడ్ని మరిచిపోయినందుకు చరిత్ర కన్నీళ్ళు పెట్టుకుంది. అతడే గ్రాండ్ ఫాదర్ ఆఫ్ క్యాలీ ఫ్లవర్ .. ’ అనే వాయిస్ మీద బ్రిటీష్ కాస్ట్యూమ్స్ తో గుర్రం మీద సంపూర్ణేష్ బాబు రివీలవుతాడు. ఆర్కే మలినేని దర్శకత్వంలో ఆశాజ్యోతి గోగినేని దర్శకత్వంలో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. మరి ఈ సినిమాతో బర్నింగ్ స్టార్ .. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ వెటకారం గా మారతాడేమో చూడాలి.
https://twitter.com/sampoornesh/status/1391269626936369152











