రైతుల ఉద్యమానికి మద్దతుగా హర్యానా కు చెందిన మతప్రబోధకుడు సంత్ బాబా రామ్ సింగ్ ఢిల్లీ సమీపంలోని సింఘు సరిహద్దులో తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డడం సంచలనం రేపుతోంది. రైతుల దీన స్థితిని స్వయంగా మూడు వారాల నుంచి గమనిస్తున్న రామ్ సింగ్ ఈ ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో పేర్కొన్నారు. హర్యానా శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ సహా పలు ఆధ్యాత్మిక సంస్థల్లో రామ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయకుండా వారిని అణిచివేస్తోందని కలత చెందిన రామ్ సింగ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Must Read ;- శీతాకాల సమావేశాల రద్దు వెనుక ఏ ‘ఆందోళన’..