కరోనా సెకండ్ వేవ్ తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదుపేసింది. జూనియర్ ఆర్టిస్టుల నుంచి ప్రముఖ నటుల వరకు మహమ్మారి బారిన పడ్డారు. కొంతమంది ప్రముఖులు సైతం కన్నుమూశారు. తాజాగా సీనియర్ యాక్టర్ కవిత ఫ్యామిలీపై కరోనా ఎఫెక్ట్ పడింది. కొద్దిరోజుల క్రితం అమె కుమారుడు సంజయ్ రూప్ కోవిడ్ బారిన పడ్డారు. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. మరోవైపు ఆమె భర్త కూడా ఆస్పత్రిలో చేరి కరోనాతో పోరాడుతున్నారు. దీంతో కవిత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు కవితను పరామర్శించి, ఓదార్చారు. ఆమె కుమారుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కవిత కొన్నెండ్లు టీడీపీలో క్రియశీలకంగా వ్యవహరించారు.
Must Read ;- ఘంటసాల తనయుడు రత్నకుమార్ కన్నుమూత











