దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు శతాధిక చిత్రాల్ని డైరెక్ట్ చేసి.. ఇప్పడు సినిమాలేమీ చేయకుండా.. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం చేస్తున్నారు. అలాగే.. ఇన్నేళ్ళ తర్వాత ఆయన నటుడిగా కెమేరా ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఓ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. ‘మిథునం’ చిత్రం తర్వాత భరణి డైరెక్ట్ చేయబోయే సినిమా ఇదే కావడం విశేషంగా మారింది.
ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో రాఘవేంద్రరావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన సరసన సీనియర్ నటీమణి లక్ష్మి నటించబోతుండడం విశేషం. ఓబేబీ సినిమా తర్వాత లక్ష్మీ నటించే సినిమా ఇదే కావడం విశేషం. ఇక తనికెళ్ళ సినిమా ‘మిథునం’ లో లక్ష్మి బాలు సరసన నటించిన సంగతి తెలిసిందే.
Must Read ;- సెకండ్ లిరికల్ : బుజ్జులు బుజ్జులు అంటూ పాటేసుకున్న ‘పెళ్ళిసందD’ జోడీ