తనికెళ్ల భరణి.. ఓ వైపు నటుడుగా బిజీగా ఉంటూనే.. వీల్లున్నప్పుడు తన టేస్ట్ కి తగ్గట్టుగా మంచి కథలను తెరకెక్కిస్తుంటారు. ఇప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును డైరెక్ట్ చేయబోతున్నారు. అవును.. శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు నటుడుగా కెమెరా ముందుకు రావడమే ఓ విశేషమైతే… ఆ సినిమాను మరో డైరెక్టర్ తనికెళ్ల భరణి డైరెక్ట్ చేస్తుండడం మరో విశేషం.
త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఇది భరణికి దొరికిన అరుదైన అవకాశం అనుకుంటే.. ఇప్పుడు అద్భుతమైన అవకాశం దక్కింది. అది ఏంటంటే.. భరణి బాలీవుడ్ కి వెళుతున్నారు. ఇంతకీ ఎక్కడ ఎవర్నీ డైరెక్ట్ చేయనున్నారు అంటే.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ను. అవును.. అమితాబ్ ను తనికెళ్ల భరణి డైరెక్ట్ చేయబోతున్నారు. భరణి తీసిన ‘మిథునం’ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది.
ఇందులో అమితాబ్, రేఖ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై భరణి ఓ ఇంటర్ వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆరు సంవత్సరాల క్రితమే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు కార్యరూపం దాల్చనుందని చెప్పారు. అయితే.. ముందుగా రాఘవేంద్రరావుతో సినిమా తీసి.. ఆతర్వాత బాలీవుడ్ లో అమితాబ్ తో సినిమా తీస్తానన్నారు. అదీ.. సంగతి.
Must Read ;- బాలీవుడ్ లోకి ‘మిథునం’ .. జంటగా స్టార్ కపుల్ ?