తీవ్ర అనారోగ్యంతో గత 4 నెలల నుండి చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడుని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా, స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకోవడమే కాకుండా ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేశారు చిరంజీవి .
ఆయన ఆరోగ్యం కుదుటపడి కోలుకోవడంతో మెగాస్టార్ ని కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ రోజు రామ్మోహన్ నాయుడు చిరంజీవి ఇంటికి వెళ్ళారు. ఆయన్ని కలసి కృతజ్ఞతలు తెలిపారు రామ్మోహన్ నాయుడు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. నేను ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నాను. గత నాలుగు నెలల నుండి నాకు ఆరోగ్యం బాగాలేదు. కరీంనగర్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. మొదట జాండిస్ అన్నారు…కానీ ఆ ట్రీట్మెంట్ లో చాలా వీక్ అయ్యాను, మనుషులను కూడా గుర్తుపట్టలేదు. ఇడ్లీ లో సగంకుడా తినలేని పరిస్తితికి వెళ్ళాను. మొత్తానికి అక్కడనుండి హైదరాబాద్ వచ్చాను, నా అనారోగ్యం గురించి చిరంజీవి తెలుసుకుని నన్ను ఇంటి నుంచి ఆసుపత్రిలో చేర్పించారు.
నిజంగా ఇది నాకు పునర్జన్మ లాంటిది. చిరంజీవి నా అనారోగ్యం గురించి తెలుసుకుని, ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి పరామర్శించారు. అక్కడి వైద్యలు, చిరంజీవి వల్లనేను పూర్తిగా కొలుకున్నాను. ఆయన లేకుంటే నా పరిస్తితి ఏమై పోయేదో. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ కు నా జన్మంతా రుణపడి ఉంటాను, అలాగే స్వామి నాయుడు, మెగా ఫ్యాన్స్ కు కూడా నా ధన్యవాదాలు అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కూడా ఆయన ఆరోగ్య విషయాలను అడిగి మరి తెలుసుకున్నారు” అన్నారు.
Also Read: అభిమాని కుమార్తె పెళ్ళికి మెగాస్టార్ చిరంజీవి ఆర్ధిక సాయం











