మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక – జొన్నలగడ్డ చైతన్యల వివాహం ఈ నెల 9న ఉదయ్ పూర్ లో అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. నిహారిక పెళ్లిలో మెగా హీరోలందరూ ఒకే ఫ్రేమ్ లోకి వచ్చి సందడి చేసారు. ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించారు. ఇక ఇండస్ట్రీలోని ప్రముఖులు పలువురు రాజకీయ నాయకులు, స్నేహితులకు శుక్రవారం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసారు.
ఈ రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధు వరులను ఆశీర్వదించారు. ఇండస్ట్రీ నుంచి పలువరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. ఈ వేడుక హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగింది. ఈ ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్లడానికి పాస్ వర్డ్‌ని క్రియేట్ చేశారు. ఇక జేఆర్సీ ప్రాంగణాన్ని అయితే.. చాలా గ్రాండ్‌గా డెకరేట్ చేశారు.
Must Read ;- నిహారిక, చైతన్యలది.. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా?
ఈ పెళ్లి గురించి మెగా హీరో, నిహారిక బ్రదర్ వరుణ్ తేజ్ స్పందిస్తూ.. మా బంగారు తల్లి నిహారిక – మా డాషింగ్ బావ చైతన్యకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను అంటూ వరుణ్ తేజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు. అలాగే నాగబాబు కూడా ఏ తండ్రికి అయినా కూతురు పెళ్లి జరగడం అనేది మాటల్లో చెప్పలేని అనుభూతి అంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.
Also Read ;- నిహారిక పెళ్ళి వేడుకల్లో ప్రత్యేకార్షణగా నిలిచిన చిరు