సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ షూటింగ్ కు రెడీ అయిపోయారు. రామోజీ ఫిలింసిటీలో ఈ షెడ్యూల్ జరగాల్సి ఉంది. ఈ షూటింగ్ కోసం వచ్చిన సమయంలోనే ఆయన అనారోగ్యానికి గురవడంతో షూటింగ్ అర్ధాంతరంగా నిలిపివేసి చెన్నై వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పేశారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఆగిపోయిన ‘అన్నాత్తే’ షూటింగును కొనసాగించేందుకు రజినీ సిద్ధమయ్యారు. ఇటీవలే చెన్నైలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ శుక్రవారం నుంచి రామోజీ ఫిలిం సిటీలో జరిగే షూటింగులో రజినీ పాల్గొంటారు. దాదాపు నెల రోజులపాటు ఈ షూటింగ్ కొనసాగుతుందని సమాచారం. దీపావళి కానుకగా నవంబరు 4న ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. కీర్తిసురేష్, నయనతార, ఖుష్బు, మీనా, ప్రకాశ్‌రాజ్, జాకీష్రాఫ్, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంబిస్తున్న నేపథ్యంలో ఈ షూటింగ్ కు అంతరాయం కలవచ్చన్న ఆందోళన కూడా చిత్ర యూనిట్ లో ఉంది. ఊరి పెద్ద పాత్రను రజినీ ఇందులో పోషిస్తున్నట్టు సమాచారం. కథ కూడా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. తమిళనాడులో ఎన్నికలు కూడా ముగిసిపోయిన నేపథ్యంలో రజినీ ఇక సినిమాలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం రజినీ తానే స్వయంగా కొన్ని డైలాగులు రాసుకున్నట్టు కూడా చెబుతున్నారు.
Also Read:సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆరోగ్యంపై వదంతులు