తెలంగాణలో పెట్టే పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న షర్మిల జులై 8వ తేదీన తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి నాడు అధికారికంగా ప్రకటించనున్నారు.అదే రోజు పార్టీ జెండాను కూడ ఆవిష్కరించి పార్టీ విధి విధానాలను ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు లోటస్ పాండ్ నివాసంలో అన్ని జిల్లాల ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు పాల్లోనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై అందరి అభిప్రాయాలను సేకరించి తదనుగుణంగా ప్రణాళిక రూపోదించనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- టీఆర్ఎస్ మౌన వ్యూహం.. షర్మిల ఎవరు వదిలిన బాణం