ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో కోవాగ్జిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్‌కి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్ శామీర్‌పేట్ జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తారు.వచ్చే వారం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐ ఎస్‌ఎఫ్) ప్లాంట్‌ను తమ అధీనంలోకి తీసుకోనుంది.కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని భద్రతా నిపుణుల సమీక్షా సమావేశం తరువాత భారత్ బయోటెక్ కంపెనీకి భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశ వైద్య,ఆరోగ్య భద్రత విషయంలో భారత్ బయోటెక్ సంస్థ ముఖ్యమైనదని,ఈ సంస్థ ఉగ్ర ముప్పుని ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌కు సిఐఎస్‌ఎఫ్ భద్రత కల్పించనున్నట్లు హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Must Read ;- అమెరికాలోనూ త్వరలో కొవాగ్జిన్.. US FDAకు మాస్టర్ ఫైల్ సమర్పణ