టీఆర్‌ఎస్‌ను లేదా సీఎం కేసీఆర్‌ని, కేటీఆర్‌ని ఏ పార్టీ వారు విమర్శించినా క్షణాల్లో గులాబీ శ్రేణులు విరుచుకుపడతాయి.ఇదే ఇటీవలివరకు జరిగింది. ఆ మధ్య బీజేపీపైనా అదే స్థాయి ప్రతిదాడి చేసినా ఇటీవల దూకుడు తగ్గించారు.విమర్శల్లో కొందరు వ్యక్తులకు కొన్ని మినహాయింపులూ కనిపిసిస్తున్నాయనే చర్చ మొదలైంది. ఇక తాజాగా ఆ మినహాయింపుల జాబితాలో వైఎస్ షర్మిల చేరారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని రీతిలో సీఎం కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు వైఎస్ షర్మిల. ‘కేసీఆర్..మీది గుండెనా..బండనా’ అని వ్యాఖ్యానించారు. పార్టీ తరఫున నిర్వహించిన ఆన్ లైన్ మీటింగ్‌ల లోనూ పలు కామెంట్లు చేశారు. తాజాగా ఆదివారం వ్యాక్సిన్ల విషయంలో ఓ ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్‌కు ఎలా దొరుకుతున్నాయి KCR సారూ… మీకు చేత కాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..? తలాపున సముద్రమున్నా చేప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి.’’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇంత ఘాటుగా విమర్శించినా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు.
Must Read ;- షర్మిల పార్టీ YSRTP.. కాని ఎన్నో సందేహాలు
తలాపున సముద్రమున్నా చాప దూపకేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్‌కు మాత్రం దొరుకుతున్నయ్. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి. (2/2)
— YS Sharmila (@realyssharmila) June 6, 2021
పక్క రాష్ట్రంలో ఉన్న మీ అన్న, ఏపీ సీఎం జగన్‌ని అడగాలంటూ..
అదే సయమంలో సోషల్ మీడియాలో షర్మిల ట్వీట్‌పై కామెంట్లు కూడా చర్చకు కారణం అయ్యాయి. ఆ ప్రశ్న ఇక్కడ అడగాల్సింది కాదని, పక్క రాష్ట్రంలో ఉన్న మీ అన్న, ఏపీ సీఎం జగన్‌ని అడగాలని కొందరు ట్వీట్ చేయగా, ఏపీకి పట్టిన అదృష్టం తెలంగాణకు పడుతుందని..ఇలా రకరకాలుగా కామెంట్లు పెట్టారు. ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్ నుంచి మాత్రం పెద్దగా కామెంట్లు రాలేదు. ఇదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కేసీఆర్, బీజేపీ వదిలిన బాణమే వైఎస్ షర్మిల అంటూ..
కేసీఆర్,బీజేపీ వదిలిన బాణమే వైఎస్ షర్మిల అని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానుల ఓట్లను చీల్చి కాంగ్రెస్‌కు నష్టం చేయాలనే వ్యూహంతోనే ఈ ప్రణాళిక రచించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి ఇప్పటికే విమర్శలు చేశారు. అయితే షర్మిల విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కాని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకాని పెద్దగా విమర్శించడం లేదు. అప్పుడప్పుడు విమర్శించినా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాయనే చర్చ మొదలైంది.అది చాలదన్నట్లు ఏబీఎన్ –ఆంధ్రజ్యోతిలో ఆర్కే రాసిన కొత్తపలుకులో సంచలన కామెంట్లు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒకవేళ బెయిల్ రద్దయి జైలుకి వెళ్తే వైఎస్ భారతిని సీఎం చేద్దామని ఆలోచిస్తున్నట్లు చర్చ నడుస్తోందని, అదే సమయంలో బీజేపీ ఆలోచన వేరుగా ఉన్నట్లు కనిపిస్తోందని, వైఎస్ షర్మిలను ఏపీ సీఎం చేసే ఆలోచన కూడా ఉండవచ్చనే అర్థం వచ్చేలా రాశారు.ఈ కోణంలో చూస్తే ధిల్లీ స్థాయిలో రాజకీయ వ్యూహం అమలైతే తప్ప అది సాధ్యం కాదు. మరి ధిల్లీ స్థాయిలో కీలకంగా ఉన్నదెవరో రాజకీయవర్గాల్లో క్లారిటీ ఉంది. అది అర్థం చేసుకున్నందునే వైఎస్ షర్మిలపై విమర్శలు తగ్గించారని, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇప్పుడు పోరాటం చేయాల్సి ఉంటుందనే చర్చ నడుస్తోంది.
వైఎస్ షర్మిల ఎన్ని విమర్శలు చేసినా టీఆర్ఎస్ నాయకులు మౌనంగా ఉండడం ఒక ఎత్తయితే, నాయకుల వరకు సైలెంట్‌గా ఉన్నా క్షేత్రస్థాయిలోని శ్రేణులూ సైలెంట్‌గా ఉండడమే అసలు చర్చకు కారణం అవుతోంది.ఇందుకు సంబంధించి పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అనే సందేహాలూ వక్తమవుతున్నాయి.
Must Read ;- RRR లీగల్ వార్.. టీవీ9,సాక్షి టీవీ ప్రతినిధులకు నోటీసులు










