పదహారణాల తెలుగమ్మాయి చీరకడితే.. దాని దిమ్మదియ్యా అందమంతా చీరలోనే ఉన్నది అంటూ కుర్రాళ్ళు పాటలు పాడేస్తారు. అందులోంచి బహిర్గతమయ్యే అందాలకి తమ కళ్ళను అప్పగించేస్తారు. అలాంటి ఓ సుకుమార కోమల సుందరి ప్రియాంకా జవాల్కర్. ఆంధ్రాలోని అనంతపురం జిల్లాకి చెందిన అమ్మడు.. విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ మూవీతో కథానాయికగా టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. చూడడానికి ముంబై అమ్మాయిలా కనిపించినా.. ఆమె తెలుగు అమ్మాయి అనే గుట్టు బైటపడేసరికి అమ్మడికి అంతగా అవకాశాలు రావడం లేదుమరి.
మొదటి సినిమా మంచి సక్సెస్ అయినప్పటికీ ప్రియాంకాకి అవకాశాలు మాత్రం చాలా తక్కువ వస్తున్నాయి. ప్రస్తుతం ‘యస్సార్ కళ్యాణమండపం’ అనే మూవీలో నటిస్తోంది ఈ సుందరి. ఇందులో ఆమె గ్లామర్ విన్యాసాలు మతులు పోగొడుతున్నాయి. ముఖ్యంగా ఆమె నాభి సౌందర్యాన్ని చూడ్డానికి కుర్రాళ్ళకి రెండు కళ్ళు చాలవు. అలాగే తిమ్మరుసు, గమనం అనే మూవీస్ లో కూడా ప్రియాంకా జవాల్కర్ గ్లామరస్ పాత్రలే చేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆమె .. సోషల్ మీడియాలోనూ గ్లామర్ ఒలికిస్తూంటుంది.
ప్రస్తుతం ప్రియాంకా జవాల్కర్ తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఓ హాట్ ఫోటో నెటిజెన్స్ ను తెగ రెచ్చగొడుతోంది. బ్లాక్ శారీలో ప్రియాంకా తన నాజూకు నడుమందాలు చూపిస్తూ కవ్విస్తోన్న ఈ ఫోటోకి ఎవరైనా పడిపోవాల్సిందే. అంతేకాదు.. గతంలో కూడా ఆమె పోస్ట్ చేసిన శారీ ఫోటోస్ కు భలేగా రెస్పాన్స్ వచ్చింది. తనకి చీరకట్టంటే చాలా ఇష్టమని చెప్పే ఈ సుందరి.. ఆ గెటప్ లో నే కలవరమాయే మదిలో అనే మూవీలో నటిస్తోందట. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తోన్న ప్రియాంకా జవాల్కర్ .. ఇదే గ్లామర్ మెయిన్ టెయిన్ చేస్తే.. ఫ్యూచర్ లో బిగ్ బ్రేక్ రావడం ఖాయమని అంటున్నారు సినీజనం.
Must Read ;- హాట్ నెస్ తో చితక్కొడుతోన్న నిక్కీ తంబోలి