సురేష్ రైనా ఐపీఎల్-2020 సీజన్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రైనా మామ అశోక్ కుమార్ (58) హత్యకు గురైనట్లు షాకింగ్ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంజాబ్, పఠాన్ కోట్ జిల్లా తరియల్ కు చెందిన అశోక్ కుమార్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ గా పని చేసేవాడని పోలీసులు తెలిపారు. డబ్బులు లూటీ చేసేందుకు కిరాతకమైన గ్యాంగ్ అశోక్ కుమార్ ఇంటిపై దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు ఐదుమంది ఇంటి డాబాపై నిద్రపోతున్నారు. గ్యాంగ్ దాడిలో తలకు తీవ్ర గాయం కావడంతో అశోక్ కుమార్ అక్కడిక్కడే మరణించాడు. మిగిలిన వారిని హాస్పిటల్ లో చేర్చారు. హాస్పిటల్ లో చేరిన వారిలో ఆయన తల్లి సత్యాదేవి, భార్య ఆశాదేవి, కుమారులు ఆపిన్, కుశాల్ ఉన్నారు. వీరిలో సత్యాదేవి ఇప్పటికే కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
హత్యకు గురైన అశోక్ కుమార్ భార్య రైనాకు మేనత్త అవుతుందని స్థానిక మీడియా తెలియచేసింది. ఈ విషయంపై పోలీసులు మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. హత్య విషయం తెలియగానే రైనా హుటాహుటిన ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ విశ్వనాధ్. ఈ సమయంలో సురేశ్ రైనాతో పాటు ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటామని ఇప్పటికే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. జరిగిన విషాదంతో రైనాకు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు. రైనా సీజన్ నుంచి తప్పుకున్నాడని వార్తలు రావడంతో కరోనా కారణమంటూ వార్తలు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ తమ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతోనే రైనా ఇండియాకి వచ్చినట్లు తెలియడంతో అభిమానుల అనుమానాలకు బ్రేక్ పడింది.