మహేష్ బాబు గారాల పట్టి సితారా.. ఏ పని చేసినా.. చాలా క్యూట్ గా ఉంటుంది. ఏ అప్డేట్ పెట్టినా.. మహేశ్ అభిమానులకు ముద్దుగా అనిపిస్తుంది. తరచుగా ఆ చిన్నారి అల్లరి చేష్టల్ని, చిలిపిపనుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ .. సితార మీద తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది సితార తల్లి.. నమ్రతా శిరోద్కర్. అయితే సితార కూడా తన ఓన్ వీడియోస్ ను, పిక్స్ ను తన ఓన్ ఇన్ స్టా అకౌంట్స్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ కు విపరీతమైన స్పందన లభించింది. ఒక కలర్ ఫుల్ లెహెంగాలో చాలా క్యూట్ గా రివీలైన సితార.. ఈ ఏడాది మంచి రంగుల్లో తళతళలాడే కొత్త బట్టలు కట్టుకొనే సమయం వచ్చింది. సరిగ్గా నేను ఇష్టపడే విధంగా లెహెంగా డిజైన్ చేసిన మధుకి ధన్యవాదాలు అంటూ .. కేప్షన్ తో పోస్ట్ చేసింది. వెంటనే తల్లి నమ్రతా దానికి లైక్ కొట్టింది. దాదాపు 17వేల మంది దాన్ని లైక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ గా మారింది.