కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమెకు ఏదైనా ఐడియా తడితే… ట్విట్టర్లోనో, ఇన్ స్టాగ్రామ్ లోనో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను షేర్ చేశారు. ‘‘మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా. అయితే ఆ వ్యక్తిని మొదటగా ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాలి. ఆ వ్యక్తిలో సహనంతో పాటు.. ఆ సమయంలో ప్రవర్తించే తీరును దగ్గరగా గమనించవచ్చు. దీనిని బట్టి వ్యక్తిత్వం ఏంటి అనేది చాలా సులువుగా గ్రహించవచ్చు’’ అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ‘కష్టపడి పనిచేస్తేనే జీవితం ఫర్పెక్ట్ గా ఉంటుంది’ అని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Must Read ;- స్టార్ హీరోపై మనసు పారేసుకున్న లేడీ క్రికెటర్











