కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్11 మంది బీజీపీయేతర ముఖ్యమంత్రులకు లేఖలు రాశారన్నారు.ఈ నెల 5వ తేదీ వరకు కేంద్రం 25.30 కోట్ల డోసుల టీకాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించిందని తెలిపారు. 25 శాతం టీకాలు రాష్ట్రాలు కొనుగోలు చేయాల్సి ఉన్నా ఏపీ మాత్రం ఒక్క టీకాను కొనలేదని అన్నారు.చాలా రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన వారిలో లక్షల మందికి టీకాలు వేయగా ఏపీలో మాత్రం 60 వేలు దాటలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టీకాలను కూడ ఏపీ ప్రభుత్వం సరిగా వినియోగంచుకోలేక పోయిందని, అది జగన్ పాలనా తీరును తేటతెల్లం చేస్తోందని విమర్శించారు.
Must Read ;- జగన్‌కు హింట్ ఇచ్చిన ABN ఆర్కే.. కమలదళం వ్యూహం అదేనా..?











