తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. వైసీపీ దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫేక్ ఓటరు కార్డులతో ఓటేసేందుకు కడప నుంచి వచ్చినట్లు సమాచారం. 144 సెక్షన్ అమలులో ఉన్నా యథేచ్చగా వైసీపీ నేతలు తిరుగుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దొంగ ఓట్ల తీరుపై టీడీపీ భగ్గుమంది. బస్సుల్లో, కార్లలో ఇతర ప్రాంతాల నుంచి వైసీపీ మద్దతుదారులు దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళనకు దిగారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం ముందు టీడీపీ నాయకులు ధర్నా చేశారు. తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని టీడీపీ నేతలు ఆరోపించారు.
Also Read:వైసీపీ కరపత్రాల్లో వెంకటేశ్వరుని బొమ్మ.. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్